ఎంపీ నవనీత్ కౌర్ కు.. సుప్రీంలో ఊరట

మహారాష్ట్ర అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్‍కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమె కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కుల ధ్రువీకరణ పత్రం రద్దు విషయంలో బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍పై విచారణ జరిపిన జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మహారాష్ట్రతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఆనంద్‍రావ్ అద్సులేకు నోటీసులు జారీ చేసింది.