సుప్రీంకోర్టు సంచలన తీర్పు… వారికి వెంటనే
విడాకుల మంజూరు అంశంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. భార్యభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. దంపతుల మధ్య వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్చిన్నమైతే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందు కోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు అని జస్టిస్ ఎస్.కే. కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.













