కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాహుల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ గాంధీ ఎన్నిక, కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరితా ఎస్ నాయర్ 2019 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టీస్ దీపాంకర్ దత్తా బెంచ్ పిటిషన్ను కొట్టివేసింది. వయనాడ్, ఎర్నాకులం లోక్సభ ఎన్నికలను సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో గతంలో ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ఆ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.













