కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగలింది. మలయాళం న్యూస్ ఛానల్ మీడియావన్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీడియావన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. జాతీయ భద్రత పేరుతో పౌరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది. మీడియా వన్ ఛానెల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ లైసెన్స్‌ను నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా మీడియావన్ ప్రసారాలను నిలిపివేస్తూ, ఆ ఛానెల్ లైసెన్సును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 31న ఆదేశాలు ఇచ్చింది.













