తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ ను సుప్రీంకోర్టు కొలీజయం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్ సీజేగా పని చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్ హిమాకోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్గడ్ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని కొలీజయం సూచించింది.













