సుప్రీంకోర్టుకు మరో తెలుగు జడ్జి
సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఇందులో తెలుగు వ్యక్తి, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయనతో పాటు రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిథల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అహసనుల్లా అమనుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలకు పదోన్నతి కల్పించాలని కూడా సూచించింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన జస్టిస్ సంజయ్ కుమార్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. 1963 ఆగస్టు 14న ఆయన జన్మించారు. నిజాం కాలేజీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1988లో లా డిగ్రీ పొందారు. 1988లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.













