సాగు చట్టాలపై రిపోర్టును సుప్రీంకు నివేదించిన కమిటీ
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఓ సీల్డ్ కవర్లో ఈ కమిటీని సుప్రీంకు ఈ కమిటీ సమర్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త సాగు చట్టాలపై నివేదికను రూపొందించామని, అయితే ఈ నివేదికను మార్చి 19నే సుప్రీంకు సమర్పించినట్లు కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ వెల్లడించారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, మరికొన్ని వివరాలను వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. మొత్తం 85 సంఘాలతో ఈ కమిటీ చర్చలు జరిపింది. ఈ చర్చల తర్వాత తుది రిపోర్టును సీల్డ్ కవర్లో సుప్రీంకు అప్పగించింది. ప్రస్తుతం సుప్రీంకు హోలీ సెలవులు ఉన్నందున, ఏప్రిల్ 5 న జరగనున్న విచారణలో దీని భవితవ్యం తేలనుంది.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొంది. వీటిని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. వీటిని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో డాక్టర్ అశోక్ గులాటీ, డాక్టర్ ప్రమోద్ జోఫిచ అనిల్ ఘన్వాటాలు సభ్యులుగా ఉన్నారు.













