పూరీ జగన్నాథ రథయాత్రకు గ్రీన్ సిగ్నల్
పూరీ జగన్నాథ రథ యాత్రకు లైన్ క్లియర్ అయింది. రథయాత్రకు షరతులతో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్నాథ దేవాలయ కమిటీ సరైన నియంత్రణ విధించాలని, భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని, రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని, ప్రజారోగ్యం విషయలో రాజీపడరాదని సృష్టం చేసింది. జూన్ 18న ఇచ్చిన తీర్పును సవరించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు అంతకుముందు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.













