హిమాచల్ ప్రదేశ్ కు కాబోయే సీఎం ఈయనే
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. హామీర్పూర్ జిల్లాలోని నదౌన్ నియోజకవర్గం నుంచి సుఖ్వీందర్ సింగ్ గెలుపొందారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన హిమాచల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కూడా. అయితే హిమచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్నే సీఎంగా నియమించాలని ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రతిభా సింగ్ సీఎం రేసు నుంచి వైదొలగడంతో సుఖ్వీందర్ సింగ్ సుక్కు ముందంజలో ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 40 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయనకు 25 మంది శాసనసభ్యులు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపికపై ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ రేపు ప్రమాణం చేయన్నుట్లు సమాచారం.













