37 ఏళ్ల తరువాత యూపీలో.. రెండవ సారి : సుజనా చౌదరి
37 ఏళ్ల తరువాత యూపీలో వరుసగా రెండవ సారి ఒకే పార్టీ అధికారంలోకి రావడం గొప్ప విషయమని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఆ ఘనత సీఎం యోగీ ఆదిత్యనాథ్, ప్రధాని మోదీల సమర్థ పాలన ఫలితమేనన్నారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడిన వారికి ఓటమి తప్పలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారకులైన నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.













