విదేశాల్లో విద్యావకాశాలపై.. ఎడ్యుకేషన్ ఫెయిర్
విదేశాల్లో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు స్వీడన్ ప్రతినిధుల బృందం ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనుంది. స్వీడన్ దేశంలో యునివర్సిటీలలో ప్రవేశాలు, కోర్సుల వివరాలు, స్కాలర్ షిప్‌లు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రతినిధుల బృందం విద్యార్థుల సందేశాలను నివృత్తి చేస్తారు. ఈ నెల 23న బెంగళూరు, 24న చెన్నై, 25న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించనున్నట్లు అంబాసిడర్ ఆప్ స్వీడన్ టు ఇండియా జన్ తెజాలిప్, అండ్రెస్ లార్సన్, రాజీవ్ తొట్లపల్లిలు తెలిపారు.













