లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు … ప్రధాని ఎవరైనా వాళ్లు కచ్చితంగా
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని ఎవరైనా వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని ఆయన అన్నారు. భార్య లేకుండా ప్రధాని కార్యాలయంలో నివాసం చేయడం సరికాదు అని ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నియమాన్ని తప్పవద్దు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షానికి ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మీడియా లాలూను ప్రశ్నించింది. దానికి స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.













