తాము అధికారంలోకి వస్తే… ఆ కేసు మిస్టరీని చేధిస్తాం
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక మిస్టరీని వెల్లడించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసు మిస్టరీని చేధిస్తామని స్టాలిన్ భరోసా ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోయప్పురంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దివంగత నేత మరణానికి దారితీసిన పరిస్థితులను వెలికితీసేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు ఆసక్తి కనబరచడం లేదని స్టాలిన్ ఆరోపించారు. జయ మరణంపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట వీరు హాజరు కాలేదని దుయ్యబట్టారు. ఏఐఏడీఎంకే తమ మేనిఫెస్టోను కాపీ కొట్టందని, ఇది డీఎంకే మెనిఫెస్టోకు జిరాక్స్ కాపీలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.













