అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు
అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు అయోధ్య జిల్లా అధికారులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. భక్తులు రామనవమి ఉత్సవాలను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. కరోనా వైరస్ను బ్రేక్ చేయాలన్నది తమ ఉద్దేశమని, ఇందులో భాగంగా అయోధ్యలో అన్ని సామూహిక కార్యక్రమాలు జరగకుండా తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా తెలిపారు. రామనవమి ఉత్సవాలు అత్యంత నిరాడంబరంగా జరుగుతాయన్నారు. ఈ ఏడాది రామనవమి రోజున ఒక పూజారి, కొందరు పోలీసులు ఉంటారని, అసలు ఆర్భాటంగా పూజలు జరగబోవని రామజన్మ భూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.













