గూగుల్ లో ఎక్కువగా వెతికింది దీనికోసమేనట!
కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడిపోతున్న వేళ గూగుల్ ఎక్కువమంది భారతీయులు శోధించింది దీని కోసమో తెలుసా. రష్యా కొవిడ్ వ్యాక్సిన్ గురించేనట. ఇక, ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ వంటివాటిని ఎక్కువగా వెతికారట. ఈ మేరకు ఆగస్టు నాటి సెర్చ్ ట్రెండ్స్‌ను గూగుల్ విడుదల చేసింది. స్పుత్నిక్, స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం వరుసగా 3,300 శాతం, 2,700 శాతం శోధనలు పెరిగినట్టు గూగుల్ తెలిపింది. అలాగే, భారత స్వాతంత్య్ర దినోత్సవం కోసం 3,750 శాతానికి పైగా సెర్చ్ లు జరిగినట్లు గూగుల్ నివేదిక పేర్కొంది.













