అంబానీ ఇంట దుర్గామత పూజ

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలో వేడుకల్లో ముఖ్య ఘట్టమైన శుభ్ వివాప్‌ా కు ఒక్కరోజే ఉండటంతో అంబానీ ఫ్యామిలీ తాజాగా దుర్గామాత పూజ నిర్వహించింది. అంత మంచే జరగాలని ప్రతి ఒక్కరూ వివాహానికి ముందు ఇంట్లో పూజ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా అంబానీ ఫ్యామిలీ కూడా మాతా కీ చౌకి (దుర్గామాత పూజ) నిర్వహించింది. ఈ వేడుకల్లో అంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ హైలెట్‌గా నిలిచారు. అనురాధ వకీల్ డిజైన్ చేసిన ఎరుపు రంగు గుజరాతీ ఘర్చోలా చీరలో మెరిసిపోయారు. చీర మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. ఇక చీరకు తగ్గట్టే మ్యాచింగ్ నెక్‌సెట్, చెవిపోగులు, గాజులు ధరించారు.