కొత్త పార్లమెంట్ లో ప్రత్యేక సెషన్
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నారు. అయితే నూతన పార్లమెంటు భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యునిఫాం ధరించి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ యూనిఫాంను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉంటాయి. వారి చొక్కాలు పువ్వుల డిజైన్తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయి. మరికొన్ని మార్పులతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఉభయ సభల్లో కూడా మణిపురి తలపాగాలు ధరించేలా నిర్ణయించారు. పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులుగా మిలటరీ తరహాలో డిజైన్ ఉంటుంది.













