అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు స్పెషల్ చార్టర్ ఫ్లైట్
ప్రపంచములో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది, కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో దేశాల లో ఉంటున్న భారతీయులు విపత్కర పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశం లోని ఎంతో మంది తెలంగాణ కు చెందిన వలస కార్మికులు జీవన భృతి కోల్పోయి గత నాలుగు నెలలు గా దుర్భర మైన పరిస్థితులలో జీవిస్తూ తెలంగాణ కు తిరిగి రావడానికి తగిన విమాన యాన వసతులు లేకపోవడం తో చాలా బాధలకు గురయ్యారు.
ఈ విపత్కర కాలములో తెలంగాణ కార్మికులకు ఎక్కువ మంది ఉండటం వలన వందే భారత్ ద్వారా కొంత మంది ప్రయాణం చేయగలిగారు, మిగితా తెలంగాణ కార్మికుల్ని స్వదేశానికి రప్పించడానికి చార్టర్ ఫ్లైట్ వేశారు అని TFA అధ్యక్షుడు రాజశ్రీనివాస రావు మరియు GWAC అధ్యక్షుడు కృష్ణ తెలియ జేశారు, ఈ విషయం లో వలస కార్మికులకు ఎప్పటికి అండగా ఉండే టి ఆర్ ఎస్ – ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు ప్రత్యేక చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల లోని అధికారులను సంప్రదించి అన్ని అనుమతులు తెప్పించడం లో ముఖ్య పాత్ర పోషించారు. TFA అండ్ GWAC సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి, IT మినిస్టర్ కేటీర్ గారికి, ఎన్నారై సలహాదారు, మాజీ ఎంపీ కవిత గారికి, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి మరియు శ్రీ చిట్టి బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వివిధ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు TFA అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు ప్రత్యేక కృత్గ్యతలు తెలియ జేశారు. అలాగే GTWCA అధ్యక్షుడు శ్రీ జువ్వాడి శ్రీనివాస రావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు.













