లోక్సభ ఎటాక్ వెనుక ఆరుగురు?.. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు లోక్సభ స్పీకర్ ఆదేశం!
లోక్ సభ భద్రత లోపంపై స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. ఈ విషయంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు ఆదేశించినట్లు సభకు ఆయన తెలియజేశారు. ఇది చాలా సీరియస్ విషయమని, దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదని ఆయన అన్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఈ విషయంలో అవసరమైన ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు పార్లమెంటులో చొరబడగా.. ఎంపీల సాయంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో ఇద్దరు పార్లమెంటు బయట గ్యాస్ క్యానిస్టర్లతో గొడవ చేశారు. మరొకరిని కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. లోక్సభలో జీరో అవర్ సమయంలో పసుపు రంగు గ్యాస్ క్యానిస్టర్లను తీసుకొని హౌస్ ఫ్లోర్లోకి ఇద్దరు దూసుకొచ్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.













