సోనియాకు షాక్.. ఇక తప్పదు రావాల్సిందే
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కొద్ది రోజుల గడువు కోరిన విషయం విధితమే. కరోనా బారినపడి కోలుకున్న సోనియా గాంధీని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కొద్ది రోజుల పాటు ఈడీ ఎదుట హాజరు కాలేదనని చెప్పగా ఇందుకు ఈడీ సైతం అంగీకరించింది. ఈ క్రమంలో మళ్లీ సమన్లు పంపింది. జలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీని సైతం ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.













