సోనియా గాంధీ కీలక నిర్ణయం…ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లకు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు ఉద్వాసన పలికారు. రాజీనామా చేయాలని ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అద్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి పార్టీని పటిష్టం చేయాలని సోనియా యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియా గాంధీ రాజీనామాలు కోరారని పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.













