సోనియా చెప్తేనే అధ్యక్ష రేసులో నిలబడ్డా: మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకే తాను పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీని ముందుండి నడిపించాలని సోనియా తనను కోరారని ఖర్గే తెలిపారు. గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపకపోవడంతో ఈ అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచేందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేతోపాటు మరో సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌తో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సోనియా తన ఇంటికి పిలిపించి మరీ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరారని చెప్పిన ఖర్గే.. తాను ముగ్గురు పేర్లు ప్రతిపాదిస్తానని చెప్పగా ఆమె నిరాకరించారని, తననే పార్టీకి నాయకత్వం వహించాలని కోరారని పేర్కొన్నారు.













