కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. జీఎస్టీలోకి తెస్తే వాటిపై
దేశంలో పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గగలవని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పకుండా వీటిని జీఎస్టీలోకి చేర్చేందుకు ప్రయత్నించగలరని గడ్కరీ తెలిపారు. జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, సామాన్యులకు ఉపశమనం కలిగిచేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు.













