కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి కన్నుమూత
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశీష్ ఏచూరి (34) మరణించారు. రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డారు ఆశీష్. దీంతో ఆయన గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఓ జాతీయ ఛానల్లో ఆశీష్ ఏచూరి జర్నలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడు. ఈ వార్త చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అంటూ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.













