శివరాత్రి సందర్భంగా…సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం
సింగర్ మంగ్లీ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఆమె గొంతులో ఏ పాట పాడినా అది అమృతంగా మారి బయటకొస్తుంది. ఆ గళం ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. మహాశివరాత్రి సందర్భంగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సద్గురు కోయంబత్తూర్లో (మార్చి 11 రాత్రి) నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో మంగ్లీ పరమశివుడి పాటలు పాడారు. ఆమె భక్తిపాటలు వేడుకల్లో కొత్త జోష్ నింపాయి. అప్పటిదాకా కుర్చీలకు అతుక్కుపోయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న జనం, శివభక్తులు, సద్గురు అభిమానులు, మంగ్లీ పాటలు పాడటం ప్రారంభించగానే పైకి లేచి భక్తి పారవశ్యంతో డాన్స్ చేశారు. సద్గురు కూడా నటరాజు భంగిమల్లో నృత్యం చేసి వారితో మరింత ఉత్సాహం నింపారు. ఆ దృశ్యాలను టీవీ, కంప్యూటర్ తెరలపై లక్షలాది మంది వీక్షించారు.













