అయోధ్య సీతమ్మకు ధర్మవరం పట్టుచీర
అయోధ్య సీతమ్మకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ధర్మవరం పట్టు చీర ఇది. 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పు తో ఉన్న ఈ చీరపై 13 భాషల్లో జై శ్రీరామ్ నినాదం… చీర అంచుల్లో రామయాణంలోని 400 ఘట్టాల చిత్రీకరణ వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పట్టు చీరను శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు రూపొందించారు.చీర తయారీకి మల్బరీ దారంతోపాటు కాటన్, లెనిన్, గద్వాల్, సిలికాన్, కొర్నియా తదితర రకాల పట్టు పోగులను వినియోగించారు. రూ.5 లక్షల ఖర్చుతో ఈ పట్టు చీర నేసేందుకు 4 నెలలు పట్టింది.అయోధ్య రామజన్మభూమి కమిటీ పెద్దల సూచన మేరకు చీరను రూపొందించారు.













