రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై… శివసేన కీలక నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాత్రోశ్రీలో పార్టీ ఎంపీతో జరిగిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపిన ఉద్దవ్ ఠాక్రే.. శివసేన మద్దతు ద్రౌపదీ ముర్మూకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.













