రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియాకు ఆహ్వానం.. కన్ఫర్మ్ చేసిన దిగ్విజయ్ సింగ్
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సీపీపీ చైర్మన్ సోనియా గాంధీకి కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. ‘సోనియా గాంధీకి ఆహ్వానం అందింది. దీనిలో తప్పుబట్టడానికి ఏముంది? ఆమె కూడా చాలా పాజిటివ్‌గానే ఉన్నారు. అయితే ఆమె స్వయంగా మందిర ప్రారంభోత్సవానికి వెళ్తారు. లేదంటే ఆమె బదులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డెలిగేషన్ను పంపుతారు’ అని దిగ్విజయ్ తెలిపారు. అదే సమయంలో తనకు ఆహ్వానం అందకపోవడం గురించి కూడా మాట్లాడిన ఆయన.. బీజేపీపై చురకలేశారు. బీజేపీ నిజమైన భక్తులకు ఆహ్వానాలు అందించడం లేదని అన్నారు. ‘ఎల్‌కు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ అయినా.. దిగ్విజయ్ సింగ్ అయినా.. వీళ్లకు ఆహ్వానాలు అందవు’ అంటూ ఎద్దేవా చేశారు.













