అటార్నీ జనరల్ గా ముకుల్ రోహత్గీ ?
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా నియమితులవనున్నారు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు రోహత్గీ తన ఆమోదాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత అటార్నీ జనర్నల్, 91 ఏళ్లు నిండిన కేకే వేణుగోపాల్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో మకుల్ రోహత్గీని ఆయన స్థానంలో నియమించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం 2014 నుంచి 2017 మధ్య రోహత్గీ అటార్నీ జనరల్‌గా కొనసాగారు. అనేక మంది నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాల కేసులను ఆయన వాదించారు.













