ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధప్రదేశ్, తెలంగాణలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడుతుందని, మర్చి 14న పోలింగ్ జరుగుతుందని వెల్లడించింది. అలాగే 17వ తేదీన ఓట్లు లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానాలు త్వరలో ఖాళీ కానున్నయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడింది. ఆంధప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి చిన్నారెడ్డిని ఖరారు చేసిది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.













