సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు… పది రోజుల పాటు ఎలాంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని మధురలో గల కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతల పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పది రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా రైల్వే శాఖను ఆదేశించింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వందేభారత్ లాంటి అధునాత రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు 21 కి.మీల స్ట్రెచ్‌ను నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణ జన్మభూమి వెనుకవైపు ఉన్న నయీబస్తీలో ఇప్పటివరకు 135 ఇళ్లను కూల్చివేశారు.













