మతమార్పిడులు నియంత్రణ విషయంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు
మతమార్పిడిల నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మతమార్పిడులు జరగకుండా చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేంద్రానికి సుప్రీం నోటీసులు పంపింది. మత మార్పిడులను అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని, దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషన్‌దారు కోరారు. బెదిరింపులతో మత మార్పిడులకు పాల్పడడం, ఏవైనా కానుకలు ఇచ్చి కానీ లేక డబ్బు ఇచ్చి ఆశ చూపి మత మార్పిడులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మతమార్పిడులు విషయంలో కేంద్రం అభిప్రాయం తెలుసుకోవడం, ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.













