ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు .. సుప్రీంకోర్టు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓ టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మి కేసులను ఒకేదానిగా ఢిల్లీ కి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపూర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.













