తెలంగాణ సహా మూడు రాష్ట్రాలకు ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు
రాష్ట్రస్థాయిలో మైనారిటీల గుర్తింపు విషయంలో స్పందన తెలియజేయడానికి తెలంగాణ, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లాల ధర్మాసనం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. కేంద్రం అభ్యర్థన మేరకు ఈ గడువునిచ్చింది. ఆరు వారాల్లోగా స్పందించకపోతే వారి స్పందనను ఆమోదించేది లేదని తేల్చిచెబుతూ తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను కూడా అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. పది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారనీ, ఇలాంటివారి గుర్తింపునకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన కోరారు.













