Mohan Bhagwat: సావర్కర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి: మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల వేళ, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముంబైలో జరిగిన ‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌కు (Veer Savarkar) దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సావర్కర్‌కు ఈ గౌరవం దక్కితే, ఆ అవార్డు ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ‘హిందు’ అనే పదానికి భగవత్ (Mohan Bhagwat) తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు. హిందు అనేది ఒక మతాన్ని సూచించే నామవాచకం కాదని, అది భారతీయ నాగరికతను, సంస్కృతిని ప్రతిబింబించే విశేషణమని (Adjective) చెప్పారు. ఈ నిర్వచనం ప్రకారం భారత్‌లో నివసించే ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఈ దేశ పుత్రులేనని, వారంతా హిందువులేనని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్లో కుల వివక్షకు తావులేదని, ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అలాగే పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భగవత్ (Mohan Bhagwat) ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ సుమారు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారని, వారంతా ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశంలో మారుతున్న జనాభా నిష్పత్తి (Demography), అక్రమ వలసల సమస్యలపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల ఆటలు ఎప్పటికీ సాగవని హెచ్చరించారు.













