కచ్చితంగా వచ్చేస్తా… చిన్నమ్మ

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఎఐఎడిఎంకే మాజీ నాయకురాలు, జయలలిత నెచ్చెలి వికె శశికళ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీకి చెందిన ఓ నేతతో ఆమె అన్న మాటాలు వైరల్ అయ్యాయి. కరోనా మహమ్మారి పోగానే తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ఆమె హామీ ఇచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆందోళన చెందకండి, పార్టీ వ్యవహారాలు తిరిగి చక్కబడ్తాయి. కరోనా పోగానే నేను రాజకీయాల్లోకి తిరిగి వస్తానంటూ శశిళక భరోసా ఇచ్చారు. దాంతో, స్పందించిన ఆ నేత అమ్మా మేమంతా మీ వెంటనే అంటూ బధులిచ్చారు.