జెఎన్‌యు చరిత్రలోనే తొలిసారిగా మహిళా వీసి నియామకం
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా శాంతి శ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆమెను ఈ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చారిత్రాత్మక రైతు ఉద్యమం పట్ల ఆమె వ్యతిరేక కామెంట్లు చేశారు. 59 ఏళ్ల శాంతిశ్రీ ధూళిపూడి ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రీబాబు పూలే యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె జెఎన్‌యు పూర్వ విద్యార్థి, ఇక్కడ ఆమె ఎంఫిల్, అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్డీ చేశారు. 1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించిన పండిట్ 1993లో పుణె విశ్వవిద్యాలయంలో చేరారు. శాంతిశ్రీ తల్లిదండ్రులు పూర్వపు సోవియట్ యూనియన్‌లో పని చేస్తుండగా సెయింట్ పీటర్స్ బర్గ్‌లో 1962లో ఆమె జన్మించారు. తండ్రి ధూలిపూడి ఆంజనేయులు సివిల్ సర్వెంట్. ఆయనది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తల్లి మూలమూడి ఆదిలక్ష్మి ఆమె రష్యాలో తమిళ, తెలుగు ప్రొఫెసర్‌గా పని చేశారు.













