సానియా మీర్జా కుమారుడికి… లైన్ క్లియర్

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు తెలిపింది. తన కుమారుడు ఇజాన్‍కు ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు అనుమతులు ఇప్పించాల్సిందిగా సానియా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరగా.. కుమారుడితో పాటు సోదరిని కూడా తీసుకెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకు ప్రత్యేక ధన్యవాదాలు. సాయ్‍తో పాటు బ్రిటన్ ప్రభుత్వం నా కుమారుడు ఇజాన్, సోదరి ఆనమ్‍ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది అని సానియా తెలిపింది.