ఎలక్షన్ కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఓటు విలువను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ప్రచార కర్తగా నియమించింది. ఆగస్టు 23న ఎన్నికల సంఘం సచిన్ టెండూల్కర్ తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఓటర్లందరినీ ఓటు హక్కు కల్పించుకునేలా అవగాహన కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎం.ఎస్.ధోనీ, అమీర్ ఖాన్, మేరీ కోమ్ నేషనల్ ఐకాన్స్ గా వ్యవహరించారు.













