పార్టీ అధికారంలోకి రావాలంటే.. నన్ను సీఎం చేయాలి
రాజస్థాన్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒక వేళ అలా చేయని పక్షంలో పంజాబ్ లాగే మనం ఓడిపోతాం అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజస్థాన్ యువనేత సచిన్ ఫైలట్ చేసిన వ్యాఖ్యలివి. తనను సీఎం చేయకుంటే రాజస్థాన్‌లో అధికారం కోల్పోయం ఖామని ఫైలట్ ధమ్కీ ఇచ్చినట్లు సమాచారం. కొన్ని రోజులుగా రాజస్థాన్ సీఎం గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత అధిష్ఠానం రంగంలోకి దిగడంతో కాస్త సర్దుబాటైంది. ఆ తర్వాత సచిన్ ఫైలట్‌కు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పజెబుతామని అధిష్ఠానం ఎంత మొత్తుకున్నా ఫైలట్ మాత్రం వినలేదు. తనకు సీఎం పోస్టే కావాలని పట్టుబట్టారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ కొన్ని రోజుల క్రితం సచిన్ పైలట్, సోనియా, ప్రియాంక, రాహుల్‌తో భేటీ అయిన తర్వాత మళ్లీ పైలట్ తెరపైకి వచ్చారు.













