ఉత్తరాఖండ్ మహిళా సీఎంగా.. రీతూ ఖండూరి ?
ఉత్తరాఖండ్‌లో సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఈ ఎన్కిల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేదిశగా హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తొలిసారి ఓ మహిళను సీఎంగా ప్రకటించాలనే యోచన బీజేపీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి సీఎంగా రీతూ ఖండూరిని ఎంపిక చేయడం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తే ఈ రీతూ ఖండూరి. కోట్ద్వార్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పైగా ఆమె భర్త రాజేశ్ భూషన్ కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ కార్యదరిశగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోదీతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ కారణాల దృష్ట్యా ఆమెనే ముఖ్యమంత్రిగా ప్రకటించొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.













