ఆ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం లేదు : ఖర్గే
సనాతన ధర్మం అంశంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్నందగామ్ జిల్లా తేక్వాలో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసె కా సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఖర్గే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మతం, రాజకీయాలు వేర్వేరు అంశాలని ఆ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం లేదన్నారు. మతం గురించి ఎవరో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నేనిక్కడికి రాలేదు. పేదల కోసం ఏర్పాటు చేసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చా. మతం, రాజకీయాలు వేర్వేరు అంశాలు. ఆ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం లేదు. దీనిపై నేను చర్చ చేయదలచుకోలేదు అని వ్యాఖ్యానించారు.













