తెలుగు రాష్ట్రాలకు ఉచితం… రిలయన్స్

ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతు ప్రకటించింది. కోవిడ్ 19కు వ్యతిరేకంగా చేస్తున్న సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్ లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుందని రిలయన్స్ పేర్కొంది.