రిలయన్స్ సంచలన నిర్ణయం… చౌక ధరలో కరోనా ఔషధం

కరోనాతో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‍ను కూడా లాంచ్ చేయనుంది. కోవిడ్ 19కు నివారణగా నిక్లోసామైడ్ (టేప్‍వార్మ్ డ్రగ్) ఔషధాన్ని రియలన్స్ ముందుకు తీసుకురానుంది. రిలయన్స్ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు-ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ )నుండి అనుమతి లభించింది.
మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారు చేసే ప్రణాళికలను కూడా రూపొందించింది. దేశీయ ఆసుపత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తోంది. ఇందుకు గానూ రిఫైనింగ్-టు-గ్రూప్ 3డీ టెక్నాలజీ స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్ వినియోగిస్తోందని బ్లూం బర్గ్ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట. రియలన్స్ ప్రయత్నాలు మంచి ఊరట ఇవ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.