కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కోసం… రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తమ ఉద్యోగులకు బాసటగా నిలిచింది. తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రియలన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగి చివరి జీతంగా ఎంత తీసుకున్నారో అంతే మొత్తాన్ని ప్రతి నెల ఐదేళ్ల పాటు అతని కుటుంబానికి అందించనుంది. అంతేకాదు మరణించిన ఉద్యోగి పిల్లల విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్ వసతి, ట్యూషన్ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నింటినీ సంస్థే భరించనుంది.
ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే వారు పూర్తిగా కోలుకునే వరకు కోవిడ్ సెలవులను పొందవచ్చని తెలిపింది. అలాగే కోవిడ్‍తో మృతి చెందిన ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందించాలని యాజమన్యాం నిర్ణయించింది. ఇక కొవిడ్‍తో చనిపోయిన ఉద్యోగి బార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పతి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును సంస్థే భరించాలని నిర్ణయించుకుంది.