కలకలం.. ముకేశ్ అంబానీకి మరోసారి
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న హర్కిసాన్దాస్ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అదే నంబరు నుంచి మూడు, నాలుగు కాల్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ముంబయిలోని డీడీ మార్గ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సదరు నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక సమాచారం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది ముకేశ్ అంబానీ నివససాం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే.













