వరల్డ్ టాప్ 100లోకి రిలయన్స్
ఆసియాలో అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. ఈ కంపెనీ 10 స్థానాలు ఎగబాకి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలోని టాప్ 100 కంపెనీలలో చేరింది. చమురు నుంచి టెలికాం వరకు వివిధ రంగాలలో పనిచేస్తున్న రిలయన్స్ ఫార్చ్యూన్ ప్రపంచ కంపెనీల జాబితాలో 96వ స్థానం (86.2 బిలియన్ డాలర్లు) దక్కించుకుంది. అయితే ఫార్చ్యూన్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్ కావడం విశేషం. ఇంతకు ముందు 2012లో రిలయన్స్ ఈ జాబితాలో 99వ స్థానంలో ఉంది. కానీ ఆ తరువాతి సంవత్సరాల్లో 2016లో 215వ స్థానానికి పడిపోయింది. అయితే అప్పటి నుంచి రిలయన్స్ ర్యాంకింగ్ క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది.













