కేంద్రం కొత్త నిబంధన… విదేశీ విద్యార్థులకు తప్పనిసరి
భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. హోం మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసిన ఎడ్యుకేషన్ ఇండియా పోర్టల్ లో తప్పనిసరిగా పేరు, వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంది. అప్పుడే వారు మన దగ్గర ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం ఇస్తారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కూడా పోర్టల్లో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ అన్ని వైద్య కళాశాలలకు ఆదేశాలకు జారీ చేసింది.













