ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
ఎర్రకోటను ఈ నెల 31 వరకూ మూసివేస్తూ పూరాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమకు కేటాయించిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్మాత్మిక జెండాలను ఎగురవేశారు. దీంతో అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు.













