ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధం : కేజ్రీవాల్
తన నివాసం ఎదుట బీజేవైఎం ఆందోళనకారులు చేపట్టిన విధ్వంసంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీనే దాదాగిరీకి పాల్పడుతూ, ఈ సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాకపోవచ్చు. కానీ దేశం ముఖ్యం. ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి దౌర్జన్యాలతో భారత అభివృద్ధి చెందదు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఇలాంటి దాదాగిరీకి పాల్పడితే ఇది ప్రజల్లో తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తుంది. ఏదైనా సమస్యను పరిష్కారించడానికి దౌర్జన్యమే సరైన మార్గమేమో అని ప్రజలు భావిస్తారు అని విమర్శించారు.













